విజయనగరం: విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలుతున్న ఉల్లి బయటపడింది. జిల్లాలోని సాలూరు పట్టణం వద్ద అధికారులు తనిఖాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 55 బస్తాల ఉల్లిపాయలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు చూపించక పోవడంతో వాహనం సీజ్ చేసి స్థానిక తహశీల్దార్‌కు అప్పగించారు.