శివ్‌పురి: ఉల్లి లోడు లారీని ఎత్తుకుపోయిన దొంగలు.. రూ.22లక్షల విలువైన ఉల్లి గడ్డలను ఉంచుకుని లారీని వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో జరిగింది. ఈనెల 11వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు 40 టన్నుల ఉల్లి గడ్డలతో ఓ లారీ బయలుదేరింది. ఆ లారీ ఈ నెల 22వ తేదీన గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అది కనిపించకుండా పోవడంతో ఉల్లి వ్యాపారి ప్రేమ్‌చంద్ మధ్యప్రదేశ్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు టెండు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆ లారీ ఖాళీగా కనిపించింది. మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి రూ.100 వరకు పలుకుతోంది.
సూరత్‌లో ఉల్లి దొంగలు
గుజరాత్: సూరత్‌లోని ఒక కూరగాయల దుకాణంలో రూ. 25 వేల విలువచేసే 250 కేజీల ఉల్లిని దొంగలు దోచేశారు. పాలన్పూర్ పటియాలోని దుకాణంలో ఈ చోరీ జరిగింది. ‘ఎప్పటిలాగే ఐదు 50 కేజీల బ్యాగులను బుధవారం రాత్రి అమ్మకానికి తీసుకొచ్చాం. గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు సంచీలను ఎత్తుకెళ్లారు’ అని దుకాణం ఉద్యోగి తెలిపారు
లారీ వదిలి ఉల్లి ఎత్తుకుపోయారు!
Published Fri, Nov 29 2019 4:48 AM | Last Updated on Fri, Nov 29 2019 5:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment