విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఉల్లి ధర వింటేనే వినియోగదారుల గుండె గుభేల్ మంటోంది. రోజురోజుకు ధర పెరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఉల్లి లేని కూర నోటికి రుచించకపోవడంతో రెండు కిలోలు కొనాలని మార్కెట్‌కు వచ్చినవారు కిలోతో సర్దుకుంటున్నారు. ఎంవీపీ కాలనీ రైతు బజార్‌లో సోమవారం కిలో ఉల్లి రూ.46లకు విక్రయించారు. కర్నూలు హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర ఆదివారం హటాత్తుగా కిలో రూ.34కు పెరగడంతో అక్కడి నుంచి రావాల్సిన ఉల్లిపాయలు నిలిచిపోయారు.
దీంతో ఎంవీపీ కాలనీ రైతు బజార్‌లో ఉల్లి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లు మూతపడ్డాయి. గత్యంతరం లేక వినియోగదారులు మహారాష్ట్రకు చెందిన ఉల్లి రూ.46కు కొనాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కర్నూలులో ఉల్లి రేటు తగ్గితే మళ్లీ అమ్మకాలు జరుపుతామన్నారు. అధికారులు ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులతో రేటు విషయమై చర్చిస్తున్నట్టు చెప్పారు.
ఉల్లి రూ.46
Published Tue, Sep 3 2013 2:07 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement