ఉల్లి విక్రయ కేంద్రాలు మూత | onions whole sale shop closed | Sakshi
Sakshi News home page

ఉల్లి విక్రయ కేంద్రాలు మూత

Sep 21 2013 2:33 AM | Updated on Sep 1 2017 10:53 PM

హోల్‌సేల్ ధరకే ప్రజలకు ఉల్లిపాయల్ని అందుబాటులో ఉంచుతామన్న అధికారుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయూరుు. ధరలను నియంత్రిస్తామంటూ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాలు మూతపడ్డారుు.

 హోల్‌సేల్ ధరకే ప్రజలకు ఉల్లిపాయల్ని అందుబాటులో ఉంచుతామన్న అధికారుల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయూరుు. ధరలను నియంత్రిస్తామంటూ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాలు మూతపడ్డారుు. వాటిని కొనుక్కుందామని వెళ్తున్న వినియోగదారులను ‘తక్కువ ధరకే ఉల్లిపాయలు’ అనే బోర్డులు వెక్కిరిస్తున్నారుు. గత్యంతరం లేక మార్కెట్‌లోకి వెళ్లి అధిక ధరకు ఉల్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉల్లి ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం, కొవ్వూరు, తణుకు, పాలకొల్లు పట్టణాల్లోని పరిస్థితులపై శుక్రవారం ‘న్యూస్‌లైన్’ పరిశీలన జరిపింది.
 
 తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :
 ఉల్లిపాయ ధరలు రిటైల్ మార్కెట్‌లో రూ.60 ఉన్న సమయంలో హడావుడిగా జిల్లా అధికారులు హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. లాభాలను పక్కనపెట్టి ఉల్లిని హోల్‌సేల్ ధరకే వినియోగదారులకు విక్రరుుంచాలని ఆదేశించారు. ఈ నేప థ్యంలోనే కర్నూలు ఉల్లికి రాష్ట్రంలోనే ప్రధాన మార్కెట్ అరుున తాడేపల్లిగూడెం వచ్చిన మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ హోల్‌సేల్ దుకాణాలను తనిఖీ చేశారు. ఇక్కడి మార్కెట్‌కు ఉల్లిపాయలను తీసుకొచ్చే రైతులతో మాట్లాడారు. తక్కువ ధరకు ఉల్లిని విక్రరుుంచడానికి వ్యాపారులు సహకరించాలని కోరారు. తర్వాత  కేఎన్ రోడ్‌లో తక్కువ ధరకే ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. నాసిరకం పాయలను ఈ కేంద్రం ద్వారా కిలో రూ.35కే అమ్మారు. తర్వాత విక్రయాలు ఆగి పోయాయి. చివరకు ఈ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. అక్కడివారిని ఆరాతీస్తే చాలా రోజుల క్రితమే ఈ కేంద్రం మూతపడిం దని చెప్పారు. తడి రకం ఉల్లి వచ్చినప్పుడు మాత్రమే  దీనిని తెరుస్తున్నారని చెప్పారు. ప్రస్తుత మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.45 నుంచి రూ.50 ఉండటంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  
 
  నాలుగు రోజులకే మూత
 కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్ : మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గతనెల 22న కొవ్వూరు రైతు బజార్‌లో ఉల్లి విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాణ్యత గల ఉల్లిని కిలో రూ.44కే విక్రరుుస్తున్నట్టు మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ కె.నాగేశ్వరశర్మ ఆ సందర్భంలో చెప్పారు. నాలుగు రోజులకే ఇది మూతపడింది. ఈ విషయమై ఇక్కడి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీలతను శుక్రవారం ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా, ఉల్లి ధరలు పెరగడంతో మార్కెటింగ్ శాఖ ద్వారా అప్పట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం ధరలు కొంతమేర తగ్గడంతో రైతు బజారులోని దుకాణాల ద్వారా మాత్రమే ఉల్లిపాయలు అమ్ముతున్నామని చెప్పారు. ప్రస్తుతం రెండు రకాల ఉల్లి అందుబాటులో ఉందని, కిలో రూ.32, మరో రకం రూ.40కు అమ్మేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
  విక్రయ కేంద్రం జాడేది
 భీమవరం (టూటౌన్), న్యూస్‌లైన్ : భీమవరం రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రంలో వారం రోజులపాటు మాత్రమే అమ్మకాలు జరిపారు. కిలో రూ.36 చొప్పున విక్రరుుంచారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్‌లో ఉల్లి నాణ్యతను బట్టి కిలో రూ.68నుంచి రూ.90 వరకు అమ్ముతున్నారు. జేసీ వచ్చి విక్రయ కేంద్రాన్ని పరిశీలించి వెళ్లారు. వినియోగదారులు ఉల్లి విక్రయ కేంద్రాలకు వెళ్తే స్టాకు లేదు, రావడం లేదని సమాధానం వస్తోంది.
 
  దుకాణమే లేదు
 తణుకు, న్యూస్‌లైన్ : ఉల్లి ధరలు పెరిగి జనం గగ్గోలు పెడుతున్నా.. ధర నియంత్రణకు అధికారులు చేపట్టిన చర్యలు ప్రయోజనం కలిగిం చడం లేదు. పట్టణంలో సుమారు 22 వేల కుటుంబాలు, 90 వేల జనాభా ఉన్నారు.  తక్కువ ధరకు కూరగాయలు, ఉల్లిపాయలు అందించేందుకు పట్టణంలో రైతుబజార్ లేదు.  ప్రస్తుతం ఉల్లి ధర నాణ్యతను బట్టి తణుకులో కిలో రూ.45 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు ఉల్లి విక్రరుుంచే కేం ద్రాన్ని పట్టణంలో ఏర్పాటు చేయలేదని, ప్రస్తు త ధరకు కిలో ఉల్లి కూడా కొనుగోలు చేయలేక పోతున్నామని పాతూరుకు చెందిన నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
 
  విక్రయ కేంద్రమా.. అంటే ఏమిటి
 పాలకొల్లు, న్యూస్‌లైన్ : మూడు నెలలుగా ఉల్లి ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాణ్యతను బట్టి ఇక్కడి మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. నాణ్యమైన పాయలు పాలకొల్లు మార్కెట్‌కు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిధరలు విపరీతంగా పెరిగిపోతున్నా పట్టించుకున్న నాథుడే లేడని వినియోగదారులు వాపోతున్నారు. ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా పాలకొల్లులో వాటి జాడే లేదు. తడిసిన, సగం కుళ్లిపోయిన ఉల్లిపాయలే ఇక్కడి ప్రజలకు దిక్కయ్యూరుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement