కామారెడ్డి/ నిజాంసాగర్, న్యూస్‌లైన్ :
నిత్యావసరాలు, కూరగాయలు, ఉల్లి, పచ్చి మిర్చి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు అడ్డగోలుగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 50 కి చేరింది. ఎర్రగడ్డ మాత్రం కిలోకు రూ. 40కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కిలో ధర రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నారు. నిజాంసాగర్ ఎల్లారెడ్డి వారాంతపు సంతలలో ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తారు.జిల్లావ్యాప్తంగా చికెన్ రూ. 150 నుంచి రూ.160 వరకు అమ్ముతున్నా రు. శ్రావణ మాసంలో మాంసాహార విని యోగం తక్కువగా ఉంటుంది. అయినా ధరలు భగ్గుమనడం విశేషం.
ఉల్లిపోటు.. మిర్చి ఘాటు
Published Mon, Aug 12 2013 2:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement