
సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ!
ఏంటీ అవాక్కయ్యారా..గంటల తరబడి కిలో ఉల్లిపాయల కోసం పడిగాపులు కాస్తుంటే ఉచితంగా ఉల్లి ఏంటని ఆలోచిస్తున్నారా..నమ్మలేకపోతున్నారా..అయితే మీరు పెందుర్తి రావలసిందే..వినియోగదారులను ఆకట్టుకునేందుకు సాదారణంగా బంగారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, వెండి, తగ్గింపు ధరలు పెడుతుంటారు.
ఆ జాబితాలోకి తాజాగా ఉల్లి కూడా చేరింది. ఉల్లి డిమాండ్‌ను ‘క్యాష్’ చేసుకునేందుకు సెల్‌ఫోన్ దుకాణదారులు ఉచిత ఉల్లి ఆఫర్‌తో రంగంలోకి దిగారు. రూ.20కి సిమ్‌కార్డు కొంటే కిలో ఉల్లిపాయలు ఉచితంగా ఇచ్చారు. పెందుర్తిలో శుక్రవారం ఈ వ్యాపారం మూడు సిమ్‌లు ఆరు ఉల్లిపాయల్లా చక్కగా సాగిపోయింది. - పెందుర్తి