ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయి. పానీ పూరీ నుంచి దేంట్లోనూ ఒక్క ఉల్లిపాయ ముక్క కనపడితే ఒట్టు. ఇలాంటి సమయంలో, ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయడం సాధ్యమేనా? కానీ.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం.. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదని ఓ వ్యక్తి ఓ చిరు వ్యాపారిని కాల్చి పారేశాడు!! ఈ సంఘటన ఇటా ప్రాంతంలోని అలీగంజ్ సమీపంలో జరిగింది. పూజారి అనేవ్యక్తి పాత నేరస్థుడు. అతడు తనతో పాటు నలుగురు స్నేహితులకు ఆమ్లెట్లు కావాలని ఓ చిరు వ్యాపారి వద్ద ఆర్డర్ చేశాడు.
అతడు ఆమ్లెట్లయితే ఇచ్చాడు గానీ, వాటిలో ఉల్లిపాయలు వేలేదు. దీంతో వారందరికీ ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఉల్లిపాయలు కొనేంత స్థోమత తనకు లేదని, అందువల్లనే ఉత్త ఆమ్లెట్లు ఇస్తున్నానని దీపు కశ్యప్ అనే సదరు చిరు వ్యాపారి వారికి చెప్పాడు. వెంటనే పూజారి జేబులోంచి తుపాకి తీసి.. అతడిని కాల్చిపారేశాడు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదుచేశామని, వారి కోసం గాలిస్తున్నామని ఐజీపీ (ఆగ్రా) అశుతోష్ పాండే తెలిపారు.
ఆమ్లెట్లో ఉల్లిపాయలు లేవని.. కాల్చిపారేశాడు!!
Published Tue, Sep 24 2013 11:16 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement