
స్టఫ్‌డ్ పొట్లకాయ
హెల్దీకుకింగ్
తయారి సమయం: 30 నిమిషాలు
కావలసినవి:పొట్లకాయ – 1(మూడంగుళాల పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి)ఉల్లిపాయ – 1జీలకర్ర – అర టీ స్పూన్ కొత్తిమీర – గార్నిష్‌కి సరిపడా
స్టఫ్ కోసం:పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లుగసగసాలు – రెండు టీ స్పూన్లుపచ్చిమిర్చి – అయిదుపచ్చిబఠాణి– పావు కప్పు (ఉడికించాలి)ఉప్పు – సరిపడా(పై పదార్థాలలో కొద్దిగా నీటిని చిలకరించుకుని మిక్సీలో పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి)
తయారి:∙ముందుగా పొట్లకాయ ముక్కల్లో స్టఫింగ్ మిశ్రమాన్ని కూరాలి.పాత్రలో నూనె వేడయిన తరవాత జీలకర్ర చిటపటలాడించి పసుపు, ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.కూరిన పొట్లకాయ ముక్కల్ని జత చేసి కలిపి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి. (ప్లేట్లో కొద్దిగా నీరు పోసి మూత పెడితే అడుగంటకుండా ఆవిరికి త్వరగా ఉడుకుతుంది.) ఇలా 15 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.పొట్లకాయ మెత్తబడగానే దింపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా అన్నంలోకి వడ్డిస్తే రుచిగా ఉంటుంది.