అక్కడ మరోసారి క్షీణించిన ఉల్లి ధరలు | Lasalgaon onions plunge to Rs 1 a kg | Sakshi
Sakshi News home page

అక్కడ మరోసారి క్షీణించిన ఉల్లి ధరలు

Published Fri, Sep 9 2016 5:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

Lasalgaon onions plunge to Rs 1 a kg

నాసిక్ : నిన్న మొన్నటి దాకా  వినియోగదారులకు కళ్లనీరు తెప్పించిన  ఉల్లిధరలు ఇపుడు మహారాష్ట్రలో ఉల్లి రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి పాయల మార్కెట్   లాసల్గాన్ లో గురువారం ఉల్లి ధర భారీగా పడిపోయింది.  ఇప్పుడక్కడ మంచి రకానికి చెందిన వంద కిలోల ఉల్లిపాయలు ధర రూ. 425 పలుకుతున్నాయి.  కిలో రూ 4.25 గా నమోదైంది. 2012 జూన్ తర్వాత ఈ స్థాయికి  దిగి రావడం ఇదే మొదటి సారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

మార్కెట్ డిమాండ్ పోలిస్తే సరఫరాలో పెరుగుదలే ధరలు తగ్గుముఖం పట్టడానికి రైతులు భారీ పరిమాణంలో ఉల్లిపాయలు తీసుకువస్తున్నారనీ,  డిమాండ్ తక్కువగా ఉందన్నారు.   ఇదికాకుండా,  మంచి నాణ్యతలేని ఉల్లిపాయల కారణంగా అత్యంత నష్టం వాటిల్లిందని  లాసల్గాన్ ఏపీఎంసీ  చైర్మన్ జయదత్త  హోల్కర్  చెప్పారు.  నాణ్యత లేని  క్వింటా ఉల్లిని రూ .100 చొప్పున అమ్ముతున్నారని, ఈ ఏడాది ఆగస్టు 16 నాటికి ఉల్లి కనీస టోకు ధర రూ 150 క్వింటాలు వద్ద నిలిచిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నుంచి ఉత్పత్తి బావుందన్నారు. ప్రస్తుతం మార్కెట్ కు వస్తున్న ఉల్లిపాయలు  వేసవి పంట ఏప్రిల్, మే నెలలది,   నాలుగు ఐదు నెలల పాతది కావడంతో ఇప్పటికే మొలకెత్తుతోందని జాతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ డైరెక్టర్ నానాసాహెబ్ పాటిల్  తెలిపారు.  ఇది కూడా ధరల క్షీణతకు కారణమన్నారు.
మరోవైపు భారతదేశం లో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయవిధానంలోఅవకతవకలు  రైతుల నడ్డి విరుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయడ్డారు.   ప్రధానంగా ఉల్లి ధరల్లోని  భారీ ఒడిదుడుకులకు ఇదే నిదర్శనమన్నారు.  ఫలితంగా  అటు  ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారన్నారు.  వ్యవసాయ మార్కెటింగ్  వ్యవస్థలను పటిష్టపర్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.  ఉత్పత్తిదారులకు ప్రభుత్వాలు  మార్కెట్ సదుపాయాలు, మంచి, వేగవంతమైన రవాణా వ్యవస్థలను కల్పించి, ధరల్లోని అస్థిరతను తొలగించాలనీ, దీనికి రాజకీయ సంకల్పం అవసరం విశ్లేషకుల వాదన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement