16 నుంచి 24 వరకు మిర్చి కొనుగోళ్లు బంద్
కర్నూలు(వైఎస్‌ఆర్ సర్కిల్) : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోఈనెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను నిలిపివేస్తామని కమీషన్ ఏజెంట్లు పట్టుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమీషన్ ఏజెంట్లను, వ్యాపారులను చర్చలకు పిలిపించి ఒప్పందం కుదిర్చారు. పక్షం రోజుల పాటు కాకుండా వారం రోజుల వరకు కొనుగోళ్లు బంద్ చేయవచ్చన్నారు. ఈ మేరకు మార్కెట్ యార్డు శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన జారీ చేశారు. ప్రకటించిన రోజుల్లో మిర్చిని యార్డుకు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.