కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులు పండించే మిర్చిని కొనుగోలు చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
అమరావతి: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులు పండించే మిర్చిని కొనుగోలు చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు గురువారం సాయంత్రంలోగా విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఒక్కో మిర్చి రైతు వద్ద నుంచి క్వింటాల్‌కు రూ.1500 చొప్పున గరిష్టంగా 20 క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఇందుకోసం ఏటా రూ. 300-400 కోట్లు వెచ్చించనుంది. మిర్చి కొనుగోలు అనంతరం ఆన్‌లైన్‌లో రైతులకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ చెల్లింపుల విధానం శుక్రవారం నుంచి అమలు కానుంది.