మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి
మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి
Published Sun, Apr 30 2017 10:38 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
గౌరు వెంకటరెడ్డి
ఇల్లూరుకొత్తపేట(బనగానపల్లె) : మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు గౌరువెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇల్లూరుకొత్తపేటలో కల్లాల్లో నిల్వ ఉంచిన మిరప పంటను నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి పరిశీలించారు. గతేడాది కిలో మిర్చి రూ.125 పలికిందని, ప్రస్తుతం రూ.40 కూడా మించడం లేదని మిర్చి రైతులు గౌరు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి గుంటూరులో దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.5వేల కోట్లతో రైతు సంక్షేమ ని«ధిని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
కిలో రూ.80 ప్రకారం కొనుగోలు చేసినా రైతులకు కనీసం పెట్టుబడైనా దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు మిరప సాగు చేశారన్నారు. గిట్టుబాటు ధర లభించక ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు రైతులు పూర్తిగా మద్దతు ప్రకటించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి గుండం శేషిరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, స్థానిక నాయకులు రమణ, వెంకటసుబ్బారెడ్డి, కూరంరామిరెడ్డి, ఈశ్వరయ్య, చాంద్‌బాషా, సర్వేశ్వరరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Advertisement