ఖమ్మం: స్థానిక మార్కెట్ యార్డ్‌లో శనివారం ఉదయం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపారులతో మార్కెట్‌యార్డు చైర్మన్ కృష్ణ చర్చలు సఫలం కావడంతో ట్రేడింగ్ మొదలైంది. ధర విషయంలో నాణ్యత చూసి కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు తెలిపారు. రైతులు తెచ్చిన మిర్చి నాణ్యత ఆధారంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
రైతులకు సరైన ధర కల్పించాలని, వ్యాపారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ హెచ్చరించారు. మార్కెట్ యార్డులోని రాజకీయ నాయకులు రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీసులకు ఆదేశించారు. మిర్చీకి సరైన ధర ఇచ్చి, తొందరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.
ఖమ్మం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం
Published Sat, Apr 29 2017 10:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement