క్వింటాకు రూ.18వేల ధరతో రికార్డు
మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర
వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చికి రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా దేశి(టమాటా, దొడ్డు) రకం మిర్చికి పలికిన ధరతో రైతుల్లో ఆనం దం వెల్లువెత్తుతోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు గురువారం భూపాలపల్లి మండలం పుల్లూరు రామయ్యపల్లెకి చెందిన రైతు పి.సంపత్ మొదటిసారి చేతికొచ్చిన దేశీ రకం మిర్చిని 13బస్తాల్లో భగవాన్ అడ్తికి తీసుకువచ్చాడు. ఈ మిర్చిని ఖరీదు దారుడు రాంగణేష్ క్వింటాకు రూ.18వేలతో కొనుగోలు చేశాడు. గతంలో మార్కెట్ చరిత్రలోనే ఏ రకం మిర్చికి కూడా ఈ ధర పలికిన దాఖ లాలు లేవని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
2013లోనే అత్యధికం
దేశీ రకం మిర్చి క్వింటాకు వరంగల్ మార్కెట్‌లో 2013 సంవత్సరంలో రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెబుతున్నా రు. ఇక గత సంవత్సరం దేశీ రకం మిర్చికి రూ.12వేల ధర పలకగా, అంతకుముందు ఏడాది రూ.13వేల ధర పలికింది. మామూలుగా ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారంలో మాత్రమే అమ్మకానికి వచ్చే దేశి రకం మిర్చి ఈసారి 15రోజుల ముం దే రావడం.. అత్యధిక ధర పలక డం విశేషం. ఈ సంవత్సరం వర్షాభావంతో పాటు చీడపీడల కారణంగా మిర్చి దిగుబడి తగ్గుతుందని భావి స్తుం డగా.. ధర మాత్రం మెరుగుగా ఉండడంతో రైతు ల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నేను ఉహించలేదు...
మా గ్రామంలో రైతులందరం దేశీ రకం మిర్చి పండిస్తాం. ముందుగా మార్కెట్‌కు వస్తే మంచి ధర పలుకుతుందని అందరికీ తెలుసు. కానీ క్వింటాల్‌కు రూ.18వేలు పలుకుతుందని మాత్రం నాతో పాటు ఎవరూ ఊహించలేదు. గతంలో మా ఊరి రైతు తెచ్చిన మిర్చి క్వింటాకు రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెప్పుకుంటున్నారు. ఇక నుంచి నాకు లభించిన ధరే రికార్డుగా చెబుతారు.
- పి.సంపత్, పుల్లూరు రంగయ్యపల్లె
మెరిసిన ఎర్ర బంగారం
Published Fri, Feb 5 2016 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement