
బాలీవుడ్ నటి కియారా అద్వానీ తాజాగా ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ధగధగ మెరిసిపోయే పసుపురంగు డ్రెస్‌లో హాట్ లుక్‌తో ఉన్న ఫొటోను కియారా పోస్టు చేసింది. డిజైనర్ అటెలీర్ జుహ్రా రూపొందించిన ఈ గౌను నారలు, నారలుగా ఉండటంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు గుప్పించారు.
ఈ డ్రెస్‌లో కియారా లుక్‌ను ప్రశంసించడానికి బదులు ‘మ్యాగీ’ న్యూడిల్స్‌తో పోలుస్తూ కామెంట్లు చేశారు. ‘మీకు మ్యాగీ చాలా ఇష్టం. కానీ, తిని.. తిని బోర్ కొట్టిందనుకోండి. దానితో ఇలా గౌను చేయవచ్చు. ఆహారాన్ని వృధా చేయకుండా ఇదే బెస్ట్ పద్ధతి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు ‘మసాలా మ్యాగీ’ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లను సరదాగా తీసుకున్న కియారా అంతే సరదాగా బదులిచ్చింది..‘హాహాహ్హా... రెడీ అయ్యేందుకు రెండు నిమిషాలే పట్టింది’ అంటూ ట్విటర్‌లో చమత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment