రిపోర్ట్ రాగానే మ్యాగీ నిషేధం | Telangana to decide on ban on Maggi after sample reports, says CH.Lakshma Reddy | Sakshi
Sakshi News home page

రిపోర్ట్ రాగానే మ్యాగీ నిషేధం

Published Fri, Jun 5 2015 10:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

Telangana to decide on ban on Maggi after sample reports, says CH.Lakshma Reddy

తిరుమల: తెలంగాణ రాష్ట్రంలో మ్యాగీ శాంపుల్స్ టెస్ట్కు పంపించామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి శుక్రవారం తిరుమలలో వెల్లడించారు. నివేదిక అందిన వెంటనే మ్యాగీపై నిషేధానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు లక్ష్మారెడ్డి తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ కె.రాంమ్మోహన్ నాయుడు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement