మ్యాగీ నూడుల్స్ సురక్షితం కాదు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు సురక్షితం కాదని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మ్యాగీ శాంపిల్స్ను లాబ్లో పరీక్షించగా, మోతాదుకు మించి సీసం వాడినట్టు తేలినట్టు వెల్లడించింది. దీంతో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు, ప్రచారకర్తలకు చిక్కులు తప్పకుపోవచ్చు.
కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ పౌరసరఫరాల కార్పొరేషన్కు సూచించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ విషయంపై బుధవారం నిర్ణయం తీసుకోనుంది. ఇక బీహార్, ఉత్తరాఖండ్లోనూ కేసులు నమోదయ్యాయి.