unsafe
-
మోదీ పర్యటనలు.. మహారాష్ట్రకు సురక్షితం కాదు: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని అన్నారు. కానీ, ప్రధాని మోదీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే ప్రధాని మోదీ పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోదీ ఎప్పుడు పర్యటించినా.. విభజన, అశాంతిని రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒక కులానికి మరొక కులాన్ని వ్యతిరేకంగా ఉంచుతున్నాయని శుక్రవారం ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చేందటం.వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోదీ అన్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
మలుపుల వద్ద రక్షణ చర్యలు లేవు.. అదుపు తప్పితే.. అంతే..!
నిర్మల్: దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు ఉండటం.. మలుపుల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్ల వెంట ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు మలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. కలమడుగు–పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో.. మండలంలోని కలమడుగు నుంచి పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ మార్గంలో పెర్కపల్లె సమీపంలో మూడు వ్యవసాయ బావులు, మున్యాల గ్రామ సమీపంలో రెండు వ్యవసాయబావులు, రేవోజీపేట గ్రామసమీపంలో మూడు వ్యవసాయ బావులు, బుట్టపూర్ గ్రామ సమీపంలో మూడు వ్యవసామ బావులు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏ మాత్రం అదుపు తప్పినా ఇందులో పడిపోయే ప్రమాదం ఉంది. మలుపుల వద్ద కానరాని రక్షణ.. పాండ్వాపూర్–కలమడుగు రోడ్డు మార్గంలో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలో కుమురంభీం చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డుపై ఉన్న మలుపు వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రోడ్డును ఆనుకొని చెట్లు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెర్కపల్లె ప్రాథమిక పాఠశాలతోపాటు మున్యాల, రేవోజీపేట, బుట్టాపూర్ గ్రామాల్లో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించాలి.. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు, మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్అండ్బీ అధికారులు సెఫ్టీ రాడ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుంది.. కానీ ఇప్పటివరకు అధికారులెవరూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి ప్రమాదాలు జరగకుండా రో డ్ల పక్కన ఉన్న వ్య వసా య బావులు, మూల మలుపుల వద్ద సెఫ్టీ రాడ్లను ఏర్పాటు చేయాలి. తరచుగా ప్రమాదా లు జరిగే చోట బోర్డులు ఏ ర్పాటు చేస్తే డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారు. – భూక్య రమేశ్, ఎర్రగుంటవాసి సమస్య పరిష్కరిస్తాం కలమడుగు–పాండ్వాపూర్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతాం. వ్యవసాయబావులు, మూల మలుపులపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. రక్షణ చ ర్యలు చేపట్టి త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. – మల్లారెడ్డి, ఆర్అండ్బీ డీఈ -
యూపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: ప్రియాంకా గాంధీ
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా లక్నోలోని బాపూ భవన్లో ఓ ప్రభుత్వ అధికారి అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిని వేధించి అరెస్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రియాంక యూపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. సచివాలయం, రోడ్డు, బహిరంగ ప్రదేశాలలో మహిళలకు భద్రత కరువైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై యూపీ ప్రభుత్వం గొప్పగా చెప్తోందని కానీ వాస్తవానికి పరిస్థితులు ఆలా లేవని విమర్శించారు ప్రియాంక. ఓ సోదరి తనకెదురైన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోకపోవడంతో తాను వాటిని వీడియో తీసి వైరల్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.దేశ మహిళలంతా మీ వెంట ఉన్నారని బాధితురాలికి ఆమె భరోసా ఇచ్చారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత సమస్యపై కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ వాదనను ఖండించింది. -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్‌బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్‌లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్‌కి సంబంధించిన యాప్స్‌ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
ఆన్లైన్ చెకప్‌లతో చేటు
లండన్ : బిజీ లైఫ్‌లో వైద్యుల వద్దకు వెళ్లే తీరికలేని వారు ఆన్లైన్ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్ వైద్యసేవలు అందించే సంస్థలు, వైద్యుల్లో 43 శాతం సురక్షితం కాదని కేర్ క్వాలిటీ కమిషన్ నివేదిక హెచ్చరించింది. వెబ్‌క్యామ్ అపాయింట్మెంట్స్ను ఆఫర్ చేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఆన్లైన్ వైద్య సేవల సంస్ధల్లో సగానికి సగం సంస్ధల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోగిని సరిగ్గా పరీక్షించకుండానే ఆన్లైన్ వైద్యులు పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్, గుండె జబ్బులకు మందులను సూచిస్తున్నారని పేర్కొంది. మరికొన్ని సంస్థలు ప్రమాదకర మందులను సైతం సిఫార్సు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కంపెనీలు వెబ్‌క్యామ్, లేదా స్కైప్ ద్వారా వైద్యులు రోగులను పరీక్షించే ఏర్పాట్లు చేస్తాయి. మరికొన్ని సంస్థలు ఆన్లైన్లో ఫాంను పూర్తిచేసిన తర్వాత దాని ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తుంటారు. రెండు గంటల పాటు పరీక్షించాల్సిన అనారోగ్య సమస్యలను సైతం పదినిమిషాల వెబ్‌క్యామ్ అపాయింట్మెంట్తో తేల్చేస్తున్నారు. వీటికి రోగుల నుంచి భారీ మొత్తం గుంజుతున్నారని ఆ సంస్థ తెలిపింది. రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకోకుండా, పూర్తిగా పరీక్షలు నిర్వహించకుండానే ఆన్లైన్ డాక్టర్లు హై డోసేజ్ మందులను సిఫార్సు చేయడం ఆందోళనకరమని పేర్కొంది. -
విద్యాసంస్థల నిర్లక్ష్యం అపరిమితం!
ఏలూరు అర్బన్ : విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బస్ ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా పిల్లల రక్షణకు సరియైన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీఏ అధికారులు అనుమతించిన పరిమితి నిబంధనను తుంగలో తొక్కుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా విద్యార్థులకు ప్రమాదం కలిగిస్తున్నా సంబంధిత ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. గత చేదు అనుభవాలు l గతంలో పెదవేగి మండలంలోని ఒక విద్యా సంస్థ కేవలం 45 మంది విద్యార్థులను తరలించేందుకు అనుమతి ఉన్న బస్‌లో ఏకంగా 130 మంది చిన్నారులను తరలించేది. పలుమార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో యాజమాన్యం దిగొచ్చింది. l గత యేడాది నగరానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థలు ఇదే విధంగా తమ కాలేజీలో చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థులను పరిమితికి తరలించేవారు. కేవలం 36 మంది మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉన్న వ్యాన్‌లో వందమందికి పైగా విద్యార్థులను తరలించడం గుర్తించిన నాటి ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు బస్‌ను ఆపివేశారు. అందులో ఉన్న విద్యార్థులను లెక్కించగా ఏకంగా నూట ఐదుగురు ఉన్నారు. డీఎస్పీ నిర్ఘాంతపోయారంటే పరిస్థితి ఎంద ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. l స్థానిక తంగెళ్లమూడిలో ఉన్న ప్రముఖ పాఠశాల బస్‌లో ఇదేవిధంగా అపరిమితంగా విద్యార్థులను ఎక్కించడంతో డ్రైవర్‌కు స్టీరింగ్ సైతం తిప్పే అవకాశం లేకపోయింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి బస్సు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. l జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యాసంస్థ బస్‌లో పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో బోల్తా కొట్టడంతో 27 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఇవిగో నిబంధనలు విద్యార్థులను తరలించే బస్‌లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ జీవో 35లో స్పష్టంగా ఉందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి ఇలా వివరించారు. l ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్ధులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బస్సులో ఉండాలి. కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆ బాక్స్‌లో ఉండాల్సిన మందుల పరికరాలు ఉన్నాయా? లేవా? అనే దానిపై 30 రోజులకు ఒకసారి పరీక్షించాలి. l బస్‌లో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ ఉండాలి. l బస్ బోల్తా కొడితే అందులో ఉన్న చిన్నారులను రక్షించేందుకు ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. l చిన్నారులు కిటికీల గుండా తలలు, చేతులు బయటపెట్టేందుకు ఆవకాశం లేకుండా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేయాలి. l సీనియర్ డ్రైవర్లను నియమించాలి. అదే సమయంలో వారి నుంచి ఫిజికల్ ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వయసు మళ్లిన వారిని డ్రైవర్లుగా నియమించకూడదు. l చిన్నారులు బస్‌లోకి ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా బస్ ఫుట్‌బోర్డు మొదటి మెట్టు నేల నుంచి 325 మి.మీల ఎత్తులో అమర్చాలి. l అన్ని బస్‌లలో అటెండర్లు ఉండాలి. వారు పిల్లలు దిగే సమయంలో లోపలికి ప్రవేశించే సమయంలో జాగ్రత్తగా సహకరించాలి l విద్యార్థులు తమ స్కూలు బ్యాగులను పెట్టుకునేందుకు లగేజీ స్థలం ఉండాలి. ఈ నిబంధనలను పాటించని బస్‌ల విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మూర్తి హెచ్చరించారు. -
భారత్ సురక్షిత దేశం కాదు: రష్యా
రష్యా తమ దేశ పౌరులు విహారయాత్రకు వెళ్లే సురక్షితమైన ప్రాంతాల జాబితా నుంచి భారత్‌ను తొలగించింది. రష్యా నిర్ణయంతో గోవాలో పర్యాటకంపై ప్రభావం చూపే అవకాశముంది. గోవాలో పర్యటించే విదేశీ టూరిస్టుల్లో ఐదు శాతం మంది రష్యాకు చెందిన వారే. సురక్షితం కాని ప్రాంతాల జాబితాలో ఇండియాను చేర్చడానికి గోవాలో నెలకొన్న స్థానిక పరిస్థితులు ప్రధాన కారణంగా రష్యా భావిస్తున్నట్టు తెలుస్తోంది. రష్యన్ రూబుల్ బలహీన పడటంతో టూరిస్టులు చౌకగా ఉండే ప్రాంతాలను ఎన్నుకుంటున్నారనీ.. గోవాలో వసతి, ఇతర సౌకర్యాలకు అధిక ధరలు ఉండటంతో టూరిస్టుల ఆసక్తి తగ్గిందని రష్యా సమాచార అధికారి తెలిపారు. తమ దేశ పర్యాటకులకు మంచి సౌకర్యాలు కల్పించేలా భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల రష్యా విమానాన్ని టర్కీ కూల్చిన నేపథ్యంలో టర్కీ, ఈజిప్టులను నిషేధిత దేశాలుగా పేర్కొంది. క్యూబా, దక్షిణ వియత్నాం, దక్షిణ చైనాలను టూరిజానికి సురక్షితమైన ప్రాంతాలుగా ప్రకటించింది. ఆసియాలోని వియత్నాం తదితర ప్రాంతాల్లో టూరిజానికి అనువైన, చౌకయిన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. -
నెస్లేకు మరో ఎదురు దెబ్బ
-
నెస్లేకు మరో ఎదురు దెబ్బ
నెస్లేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాగీ నూడిల్స్ వివాదం నుండి ఇప్పుడిప్పుడే బయట పడి మార్కెట్ లోకి మళ్లీ రంగ ప్రవేశం చేసిన వెంటనే నెస్లేకు సంబంధించిన మరో ఉత్పత్తిపై దుమారం మొదలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆహార లాబొరేటరీ సంస్థ నిర్వహించిన శాంపిల్ టెస్ట్‌లో నెస్లే పాస్తా విఫలమైంది. పాస్తాలో మోతాదుకు మించిన సీసం పరిమాణం ఉన్నట్లు తేలిందని లాబొరేటరీ అధికారి అరవింద్ యాదవ్ తెలిపారు. సాధారణంగా సీసం మోతాదు 2.5 పీపీఎం కు మించరాదు. అయితే పాస్తాలో శాంపిల్స్‌లో 6 పీపీఎం ఉన్నట్లు నిర్థారణ అయింది. ఈ రిపోర్టు ప్రకారం నెస్లే పాస్తా ప్రొడక్ట్‌ను హానికరమైన అహార పదార్థాల జాబితాలో చేర్చారు. తమ పరిశీలనలో తేలిన ఫలితాలను లక్నో లాబొరేటరీకి పంపిన అధికారులు పాస్తాపై కోర్టులో కేసు నమోదు చేయడానికి అనుమతులు కోరారు. -
మ్యాగీ నూడుల్స్ సురక్షితం కాదు
-
మ్యాగీ తరహా కేసులకు కొత్త చట్టం!
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా మ్యాగీ నూడుల్స్ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు సురక్షితం కాదని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారులకు అత్యంత హానికరంగా మారిన మ్యాగీ తరహా కేసుల్లో కఠిన శిక్షలకు అవకాశమున్న కొత్త చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర కసరత్తులు చేస్తోంది. ఈ తరహా కేసులకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలను ఉత్పత్తి చేస్తూ వినియోగదారులను మోసం చేసేవారికి, అలాంటి హానికర పదార్ధాలు, వస్తువులకు ప్రచారం కల్పిస్తున్న వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్నప్రతిపాదన ఆ చట్టంలో పొందుపరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమితాబ్, మాధురీ, ప్రీతి జింటాలపై కేసు నమోదు.. యాగీ నూడుల్స్ వివాదం దాని ప్రచారకర్తలు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలను వెంటాడుతోంది. యూపీలో ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, తాజాగా బీహార్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అమితాబ్, మాధురీ, ప్రీతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముజఫర్‌పూర్ కోర్టు ఆదేశించింది. -
మ్యాగీ నూడుల్స్ సురక్షితం కాదు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు సురక్షితం కాదని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మ్యాగీ శాంపిల్స్‌ను లాబ్‌లో పరీక్షించగా, మోతాదుకు మించి సీసం వాడినట్టు తేలినట్టు వెల్లడించింది. దీంతో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారులకు, ప్రచారకర్తలకు చిక్కులు తప్పకుపోవచ్చు. కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు సూచించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ విషయంపై బుధవారం నిర్ణయం తీసుకోనుంది. ఇక బీహార్, ఉత్తరాఖండ్‌లోనూ కేసులు నమోదయ్యాయి.