లండన్ : బిజీ లైఫ్‌లో వైద్యుల వద్దకు వెళ్లే తీరికలేని వారు ఆన్‌లైన్ డాక్టర్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ వైద్యసేవలు అందించే సంస్థలు, వైద్యుల్లో 43 శాతం సురక్షితం కాదని కేర్ క్వాలిటీ కమిషన్ నివేదిక హెచ్చరించింది. వెబ్‌క్యామ్ అపాయింట్‌మెంట్స్‌ను ఆఫర్ చేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఆన్‌లైన్ వైద్య సేవల సంస్ధల్లో సగానికి సగం సంస్ధల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రోగిని సరిగ్గా పరీక్షించకుండానే ఆన్‌లైన్ వైద్యులు పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్స్, గుండె జబ్బులకు మందులను సూచిస్తున్నారని పేర్కొంది. మరికొన్ని సంస్థలు ప్రమాదకర మందులను సైతం సిఫార్సు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ కంపెనీలు వెబ్‌క్యామ్, లేదా స్కైప్ ద్వారా వైద్యులు రోగులను పరీక్షించే ఏర్పాట్లు చేస్తాయి. మరికొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో ఫాంను పూర్తిచేసిన తర్వాత దాని ఆధారంగా వైద్యులు మందులను సూచిస్తుంటారు. రెండు గంటల పాటు పరీక్షించాల్సిన అనారోగ్య సమస్యలను సైతం పదినిమిషాల వెబ్‌క్యామ్ అపాయింట్‌మెంట్‌తో తేల్చేస్తున్నారు. వీటికి రోగుల నుంచి భారీ మొత్తం గుంజుతున్నారని ఆ సంస్థ తెలిపింది. రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకోకుండా, పూర్తిగా పరీక్షలు నిర్వహించకుండానే ఆన్‌లైన్ డాక్టర్లు హై డోసేజ్ మందులను సిఫార్సు చేయడం ఆందోళనకరమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment