నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది | Man Got Two Masala Packets In A Single Pack Of Maggi Noodles | Sakshi
Sakshi News home page

అదృష్టం అంటే నీదిరా బాబు!

Published Sat, Aug 15 2020 4:59 PM | Last Updated on Sat, Aug 15 2020 8:05 PM

Man Got Two Masala Packets In A Single Pack Of Maggi Noodles - Sakshi

మ్యాగీ ప్యాకెట్‌లోని రెండు మసాలా ప్యాకెట్లు

నెటిజన్లు తమకు ఆనందం వచ్చినా, బాధ కలిగినా వెంటనే తోటి నెటిజన్లతో పంచుకోవటం ప్రస్తుతం పరిపాటిగా మారింది. వింతగా అనిపించిన కొన్ని విషయాలు ఎంత చిన్నవైనా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటం కూడా మామూలై పోయింది. తాజాగా ఓ మ్యాగీ న్యూడిల్స్‌‌ ప్రేమికుడి పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాను కొనుక్కున్న మ్యాగీ న్యూడిల్స్‌ ప్యాకెట్‌లో రెండు మసాలా ప్యాకెట్లు రావటంతో శశ్వంత్‌ ద్వివేదీ అనే వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘‘ నేను కొన్న మ్యాగీ ప్యాకెట్‌లో​ రెండు మసాలా ప్యాకెట్లు వచ్చాయి. ఒట్టు.. నేను అబద్ధం ఆడటం లేదు’’ అని పేర్కొన్నాడు. ('ఇది త‌యారు చేసినవాడిని చంపేస్తా’)

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేశాడు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అతడి అదృష్టంపై తమ అసూయను వెళ్లగక్కారు. ‘‘ నిన్ను చూస్తుంటే నా కడుపు మండుతోంది.. దాన్ని మ్యాజిక్‌ మసాలా అనడానికి ఇదే కారణం.. నీ అదృష్టాన్ని ఉద్ధేశించి ఏమైనా ప్రసంగిస్తావా?.. అదృష్టం అంటే నీదిరా బాబు!’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement