
Mango Maggi Video: వంటకాలపై ఎప్పటికప్పుడు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కొత్త కొత్త వెరైటీలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని వెరైటీలను చూస్తే మాత్రం ఇదెక్కడి విచిత్రమని అనిపిస్తుంది. ‘ఇలా ఎవరైనా చేస్తారా?’అని అడగాలనిపిస్తుంది. అలాంటి వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరలైంది. అదే ‘మ్యాంగో మ్యాగీ’. మీరు విన్నది నిజమే. మ్యాగీని ముప్పుతిప్పలు పెట్టి చేసిన ఈ వెరైటీ వంటకం గురించి మీరూ తెలుసుకోవాల్సిందే. వీడియోలో ముందుగా.. ఫ్రై చేసే పెనంపై ఓ మహిళ మ్యాగీ నూడుల్స్‌ను వేసి, నీళ్లు పోసి మ్యాజిక్ మసాలా వేసింది.
ఆ తర్వాత మ్యాంగో స్లైస్ బాటిల్ లోంచి జ్యూస్‌ను ఆ వంట కంలో పోసింది. వంటకమయ్యాక మామిడి ముక్కలను దానిపై చల్లి అందించింది. ఈ మ్యాం గో మ్యాగీ తయారీ వీడియోను ఒకరు పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ఆ లొకేషన్ ఎక్కడో చెప్పరా. ఆ వంటకం చేసిన వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఎవరైనా వెళ్తారు’అని ఒకరు.. ‘మీరు నరకానికి వెళ్తారు’అని మరొకరు, ‘దేవుడా.. నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’అని ఇంకొకరు కామెంట్లు పెట్టారు.
Mango Maggi kha lo doston.🙌🏼 pic.twitter.com/4fY2HWJumV
— Professor D (@RetardedHurt) May 13, 2022