మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. రెగ్యులర్‌గా న్యూడుల్స్ కాకుండా మ్యాగీతో వడ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సినవి
►మ్యాగీ – 3 (రెండున్నర స్లైస్‌లను ముందుగానే ఉడికించి, నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి
►మిగిలింది చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి)
►క్యారెట్ తురుము, బీట్‌రూట్ తురుము – పావు కప్పు చొప్పున
►పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు – కొన్ని చొప్పున
►కారం, పసుపు, గరం మసాలా – 1 టీ స్పూచొప్పున
►పెరుగు – ఒక టేబుల్ స్పూన్
►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
►మైదాపిండి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు (నీళ్లు పోసి.. తోపులా చేసుకోవాలి)
►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ
►ముందుగా ఒక బౌల్ తీసుకుకోవాలి.
►అందులో ఉడికిన మ్యాగీ (చల్లారిన తర్వాత), క్యారెట్ తురుము, బీట్‌రూట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న పిండి, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ►ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు అన్నీ జోడించి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి.
►అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకోవాలి.
►మైదా తోపులో ముంచి, మ్యాగీ ముక్కల్లో దొర్లించి నూనెలో దోరగా వేయించుకోవాలి.
చదవండి: Chatpattey Coconut Recipe: క్రంచీ.. కరకరలు.. చట్‌పటే కోకోనట్, బటాడా వడ తయారీ ఇలా!
Kobbari Vadalu Recipe: రుచికరమైన కొబ్బరి వడల తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment