లక్నో : మ్యాగీ నూడుల్స్ మళ్లీ ల్యాబ్ టెస్టుల్లో విఫలం చెందింది. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లో మ్యాగీ నూడుల్స్ విఫలం చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ పరిపాలనా శాఖ అధికారులు నెస్లే ఇండియా, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులకు భారీగా జరిమాన విధించినట్లు రిపోర్టులు వచ్చాయి. సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే నెస్లే ఇండియాకు జరిమానా విధించామని ఎఫ్‌ఎమ్‌సీజీ పేర్కొంది. నెస్లేకు రూ. 45 లక్షలు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు 15 లక్షలు, ఇద్దరు అమ్మకందారులకు రూ. 11 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment