Lab Test
-
కేరళలో నిఫా కలకలం!
తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కొచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి నిఫా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. విద్యార్ధికి సంబంధించిన రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, కాలమస్సరి వైద్యకళాశాల ఆస్పత్రివర్గాలు ఆ విద్యార్థికి ప్రత్యేకవార్డు కేటాయించాయని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఎర్నాకుళంకు చెందిన సదరు విద్యార్థి ఇటీవల క్యాంపు నిమిత్తం త్రిశూర్‌కు వెళ్లాడని, ఆ సందర్భంగా అతడికి జ్వరం సోకడంతో ఆసుపత్రిలో చేరాడని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రీనా తెలిపారు. ఆ క్యాంపులో 16 మంది విద్యార్థులు ఉన్నారని, అతడితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు విద్యార్థులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఏవైనా అనుమానిత కేసులు వస్తే వెంటనే తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులను మంత్రి ఆదేశించారు. కేరళలో గత ఏడాది మే నెలలో నిఫా వైరస్ సోకి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
మళ్లీ చిక్కుల్లో మ్యాగీ నూడుల్స్
లక్నో : మ్యాగీ నూడుల్స్ మళ్లీ ల్యాబ్ టెస్టుల్లో విఫలం చెందింది. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లో మ్యాగీ నూడుల్స్ విఫలం చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ పరిపాలనా శాఖ అధికారులు నెస్లే ఇండియా, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులకు భారీగా జరిమాన విధించినట్లు రిపోర్టులు వచ్చాయి. సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే నెస్లే ఇండియాకు జరిమానా విధించామని ఎఫ్ఎమ్సీజీ పేర్కొంది. నెస్లేకు రూ. 45 లక్షలు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు 15 లక్షలు, ఇద్దరు అమ్మకందారులకు రూ. 11 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించింది. -
దీన్‌దయాళ్ ఇండస్ట్రీస్‌కు అవార్డ్
కఠినమైన ల్యాబ్ టెస్ట్‌లను తట్టుకునేలా నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్యాకేజింగ్లకుగాను దీన్‌దయాళ్ ఇండస్ట్రీస్‌కు ఈ ఏడాది అవుట్‌స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ లభించింది. ఫెడరేషన్ ఆఫ్ మధ్య ప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఆయుర్వేదం కేటగిరిలో ఈ అవార్డ్‌ను ఇచ్చింది. ఈ అవార్డ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ కంపెనీ ఎండీ, ఆనంద్ మోహన్ ఛప్పర్వాల్కు అందజేశారు.