తమ కంపెనీ తరపున ప్రచారకర్తలుగా పనిచేసిన వారికి ఏ సమస్య వచ్చినా మద్దతుగా ఉంటామని నెస్లె ఇండియా పేర్కొంది.
న్యూఢిల్లీ: తమ కంపెనీ తరపున ప్రచారకర్తలుగా పనిచేసిన వారికి ఏ సమస్య వచ్చినా మద్దతుగా ఉంటామని నెస్లె ఇండియా పేర్కొంది. మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో నెస్లె కంపెనీ వివరణ ఇచ్చింది.
నెస్లె తరపున బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటా ప్రచారకర్తలుగా పనిచేశారు. మ్యాగీ నూడుల్స్లో మోతాదుకు మించి సీసం వాడారని తేలడంతో వీటిని చాలా రాష్ట్రాల్లో నిషేధించగా, ప్రచారకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నెస్లె కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రచారకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని చెప్పారు.