తిరుపతి లడ్డూను పరీక్షించగలరా? | Does anybody test Turupathi laddus? | Sakshi
Sakshi News home page

తిరుపతి లడ్డూను పరీక్షించగలరా?

Published Fri, Jun 5 2015 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

తిరుపతి లడ్డూను పరీక్షించగలరా?

తిరుపతి లడ్డూను పరీక్షించగలరా?

మ్యాగీ వివాదంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచీ మరింత ఎక్కువగా మ్యాగీ తింటున్నానని తెలిపారు. 'మ్యాగీ'కి మద్దతుగా పుంఖాను పుంఖాలుగా ట్వీట్లు వదిలారు ఈ సంచలన దర్శకుడు. తిరుపతి లడ్డూను ఎవరైననా పరీక్షించగలరా, కనీసం రోడ్డు పక్కనున్న 100 హోటళ్లను తనిఖీ చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఎంఎన్సీలను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారని, ఈ వివాదం నుంచి మ్యాగీ బయటకు పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతి ఆహార పదార్థంలో ఎక్కువ లేదా తక్కువ మొత్తంలో ఇంగ్రేడియంట్స్ ఉంటాయన్నారు. మ్యాగీపై హఠాత్తుగా వివాదం ఎందుకు రేపారో తనకు అర్థం కావడంలేదన్నారు. క్యూట్ గా, టేస్టీగా ఉండే మ్యాగీ వివాదంలో చిక్కుకోవడంపై బాధను వ్యక్తం చేశారు. చాలా ఏళ్లు తర్వాత మేలుకున్న అధికారులు మ్యాగీ నూడూల్స్ ను పరీక్షించినట్టుగానే క్యాడ్ బరీ, అమూల్, కోల్ గేట్ నూ టెస్ట్ చేయాలని సూచించారు. మ్యాగీపై వివక్ష చూపేముందు మన చేపల మార్కెట్లను, రోడ్డు పక్కల ఆహారశాలలను శుభ్రం చేయాలన్నారు.

మ్యాగీని ఇష్టపడే, విశ్వసించే వ్యక్తిగా దాన్ని మాత్రమే తినాలని నిర్ణయించుకున్నట్టు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతారు.. మ్యాగీపై నిషేధం విధించారు.. సూపర్బ్' అంటూ వర్మ తనదైన శైలిలో విమర్శించారు. వ్యతిరేక ప్రచారంతో మ్యాగీ నూడూల్స్ ఇప్పుడు సులభంగా దొరుకుతున్నాయని పేర్కొన్నారు. మ్యాగీపై వచ్చిన ఆరోపణలు వీగి పోతాయని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement