మ్యాగీ నూడుల్స్ను నిషేధించిన కేరళ
కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే కొన్ని రసాయనాలు మోతాదుకు మించి అందులో ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ పౌరసరఫరాల కార్పొరేషన్కు సూచించారు.
నూడుల్స్ నాణ్యత మీద ఒక స్పష్టత వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని పైర సరఫరాల కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటివరకు అమ్ముడుపోకుండా మిగిలిన నిల్వలను నెస్లె కంపెనీకి తిప్పి పంపేస్తారు. కేరళ పౌరసరఫరాల కార్పొరేషన్కు ఆ రాష్ట్రంలో 1355 ఔట్లెట్లు ఉన్నాయి.