'మ్యాగీ' అమ్మకాలు నిలిపేసిన నెస్లే
న్యూఢిల్లీ: తమ మ్యాగీ నూడుల్స్‌లో హానికారక రసాయనాలు అధిక మొత్తాల్లో ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ‘మ్యాగీ’ నూడుల్స్ అమ్మకాలను నిలిపేయాలని నిర్ణయించినట్లు నెస్లే ఇండియా గురువారం అర్ధరాత్రి ప్రకటించింది. వినియోగదారుల్లో నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని పోగొట్టేందుకు ఈ చర్యతీసుకుంటున్నామని ప్రకటనలో పేర్కొంది. వీలైనంత తొందరగా మీ నమ్మకాన్ని చూరగొని మళ్లీ మార్కెట్లోకి అడుగుపెడతామని కంపెనీ స్పష్టం చేసింది.
హానికారక రసాయనాల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌పై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. బిగ్ బజార్ వాల్‌మార్ట్, మెట్రో ఏజీ సంస్థలు తమ హోల్‌సేల్ స్టోర్‌ల నుంచి మ్యాగీ నూడుల్స్‌ను ఉపసంహరించాయి.