మ్యాగీ న్యూడుల్స్ ఉత్పత్తిదారులు ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రమాణాలు ఉల్లంఘించారని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నద్దా అన్నారు.
న్యూఢిల్లీ: మ్యాగీ న్యూడుల్స్ ఉత్పత్తిదారులు ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రమాణాలు ఉల్లంఘించారని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నద్దా అన్నారు. ఆహారభద్రతపై రాజీపడబోమని నద్దా స్పష్టం చేశారు. 9 మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి తొలగించాలని కేంద్ర ఆహార భద్రత రెగ్యులేటర్ ఆదేశించింది.
అన్ని రాష్ట్రాల నుంచి ఆరోగ్య శాఖకు నివేదికలు వచ్చాయని, మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి వెనక్కిపంపాలని సూచించినట్టు నద్దా తెలిపారు. నెస్లె కంపెనీ ఆహార భద్రత విషయంలో ప్రమాణాలు ఉల్లంఘించినట్టు తాము నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు.