violated safety norms
-
covid-19: రూల్స్ పాటించలేదని దేశ అధ్యక్షుడిపై కేసు
బ్రెజీలియా: చట్టం ముందు అందరూ సమానులే అనే నిబంధనను బ్రెజిల్ కచ్చితంగా అమలు చేసింది. ఎందుకంటే రూల్స్ పాటించలేదని ఆ దేశ అధ్యక్షుడి మీదే కేసు పెట్టారు అక్కడి అధికారులు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా బ్రెజిల్ దేశం అల్లాడిన సంగతి తెలిసిందే. గతంలో విపరీతంగా కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు ఏం చేయలేని పరిస్థితి అంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. అంతటి విధ్వంసం జరిగనప్పటికీ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు కోవిడ్ రూల్స్ పాటించకపోవడం అక్కడి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిబంధనలు పాటించకపోవడం ఫలితంగా ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది. 'చబ్బీ డిక్టేటర్' అంటూ సంబోధించారు వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్లోని మారన్హవో రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం ఉంది. వీటితో పాటు మాస్క్ ధరించని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్హవో రాజధాని సావో లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాస్క్ కూడా ధరించలేదు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేతను 'చబ్బీ డిక్టేటర్' అంటూ సంబోధించారు. దీనిపై మారన్హవో రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో స్పందించారు. ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని గవర్నర్ స్పష్టంచేశారు. అయితే, అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Ryanair: ‘కిటికీ తెరిచే అవకాశం ఉంటే, కిందకి దూకేవాడేమో’ -
లాక్డౌన్లో పెళ్లి... లాక్అప్లో జంట!
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కోరల్లో చిక్కకొని ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతుంది. దీని కారణంగా చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంటే దానిని అడ్డుకోవడానికి అనేక దేశాలు లాక్డౌన్ని కూడా ప్రకటించాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఎవ్వరూ అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. దాదాపు అత్యవసర సర్వీసుల్లో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా వాళ్లు తప్ప ఎవరూ రోడ్లపై కనిపించడం లేదు. భారతదేశంలో కరోనా కట్టడికి మార్చి 24న ప్రధాని నరేంద్రమోదీ లాక్డౌన్ను ప్రకటించారు. ఈ లాక్డౌన్ సమయం ఏప్రిల్ 14న ముగిసింది. అయితే అప్పటికి భారత్లో కరోనా కేసులు ఎక్కువ కావడంతో లాక్డౌన్ను మే3 వరకు పొడిగిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. దేశం మొత్తం కఠినంగా లాక్డౌన్ను అమలు చేయాలని ఆదేశించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చెబుతున్నా కూడా కొందరు పెడచెవిన పెడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసులు చేతికి చిక్కుతున్నారు. తాజాగా గుజరాత్లో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న వధూవరులను పోలీసులు అరెస్ట్ చేశారు. (లాక్డౌన్: 4.6 లక్షల ఫోన్కాల్స్) గుజరాత్లోని నవ్సారికి చెందిన వధూవరులు స్థానిక దేవాలయంలో కుటుంబసభ్యులు 14 మందితో కలిసి శుక్రవారం పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వధూవరులతోపాటు 14మంది బంధువులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురించి నవ్సారి ఎస్పీ గిరీష్ పాండ్యా మాట్లాడుతూ ‘ఇక్కడ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి 14 మంది గుంపుతో పెళ్లి జరిపిస్తున్నారని సమాచారం అందింది. వెంటనే ఇక్కడికి చేరుకొని వారందరిని అరెస్ట్ చేశాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. (ముందు నెగిటివ్.. ఆ తర్వాత పాజిటివ్ రిపోర్టు) ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22,40,191 మంది కరోనా బారిన పడగా 1,53,822 మంది మరణించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే 13,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,767 మంది రికవరీ అయ్యారు, 452 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 766కుపైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 534 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. -
మ్యాగీ తయారీలో ప్రమాణాలు ఉల్లంఘించారు: కేంద్రం
న్యూఢిల్లీ: మ్యాగీ న్యూడుల్స్ ఉత్పత్తిదారులు ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రమాణాలు ఉల్లంఘించారని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నద్దా అన్నారు. ఆహారభద్రతపై రాజీపడబోమని నద్దా స్పష్టం చేశారు. 9 మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి తొలగించాలని కేంద్ర ఆహార భద్రత రెగ్యులేటర్ ఆదేశించింది. అన్ని రాష్ట్రాల నుంచి ఆరోగ్య శాఖకు నివేదికలు వచ్చాయని, మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి వెనక్కిపంపాలని సూచించినట్టు నద్దా తెలిపారు. నెస్లె కంపెనీ ఆహార భద్రత విషయంలో ప్రమాణాలు ఉల్లంఘించినట్టు తాము నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు.