
మ్యాగీ నిషేధించాలంటూ బడి పిల్లల ధర్నా
విజయవాడ: చిన్నపిల్లల పాలిట విషాహారమైన మ్యాగీని వెంటనే నిషేధించాలని బాలల సంఘాలు పలు చోట్ల ధర్నాకు దిగాయి.
విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట పిల్లలు ‘మీ స్వార్థం కోసం మా ప్రాణాలను బలి తీయోద్దు’ అని ఫ్లకార్డులు పట్టుకుని తమ నిరసనలు వ్యక్తం చేశారు.
తిరుపతిలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో చిన్నపిల్లలతో కలిసి ర్యాలీ తీశారు. దేశ వ్యాప్తంగా నెస్లే కంపెనీ కూడా మ్యాగీ అమ్మకాలను నేటి నుంచే నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలను నిలిపివేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి.