కాలం చెల్లిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్‌ను ధ్వంసం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
న్యూఢిల్లీ: నెస్లే ఇండియా, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అధీనంలో ఉన్న కాలం చెల్లిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్‌ను ధ్వంసం చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. కంపెనీ 39 కేంద్రాల్లో, లక్నోలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వద్ద ఉన్న నిల్వలను ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కాల్చివేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపునిచ్చిన సిమెంటు కర్మాగారాల్లోని దహన కేంద్రాల్లో నియంత్రణ సంస్థ ప్రతినిధుల సమక్షంలో వాటిని బూడిదచేస్తామని నెస్లే తరఫు లాయర్ అరవింద్ దత్తార్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఏమైనా ఫిర్యాదులుంటే కోర్టును ఆశ్రయించవచ్చని బెం^Œ స్పష్టం చేసింది. వెనక్కి పిలిచిన నిల్వలను ధ్వంసం చేయడానికి అనుమతించాలని, వాటి నిల్వ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిందని నెస్లే కంపెనీ సెప్టెంబర్ 21న సుప్రీంకోర్టు తలుపులు తట్టిన సంగతి తెలిసిందే.