
సినీ తారలు అన్నాక ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. కొందరు ఈ విమర్శలపై ఘాటుగా స్పందిస్తే.. మరికొందరు కాస్త వెటకారంగా స్పందిస్తారు. తాజాగా నటి కియారా అద్వానీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆమె ధరించిన దుస్తుల గురించి కామెంట్ చేశాడో నెటిజన్. దాంతో కియారా అతడికి వెరైటీ సమాధానం చెప్పి నోరు మూయించారు. మంగళవారం కియారా డిజైనర్ అటెలియర్ జుహ్రా రూపొందించిన డ్రెస్ ధరించి ఫోటో షూట్‌లో పాల్గొన్నారు.
పసుపు రంగులో ఈకలు, అంచులతో ఈ డ్రెస్‌ని డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు కియారా. ఓ నెటిజన్ కియారా డ్రెస్‌ను మ్యాగీ న్యూడుల్స్‌తో పోలుస్తూ విమర్శించాడు. ఈ విమర్శలపై కియారా ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘రెండు నిమిషాల్లో రెడీ’ అంటూ సమాధానమిచ్చారు. కియారా సమయస్ఫూర్తిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment