వాడని విద్యుత్‌కు వాచిపోయే బిల్లు  | Electricity Bill More Than Three Crores In Telangana | Sakshi
Sakshi News home page

వాడని విద్యుత్‌కు వాచిపోయే బిల్లు 

Published Wed, Feb 16 2022 2:18 AM | Last Updated on Wed, Feb 16 2022 12:59 PM

Electricity Bill More Than Three Crores In Telangana - Sakshi

మహబూబాబాద్‌: వందో..రెండు వందలో కాదు.. ఏకంగా మూడు కోట్లకు పైగా విద్యుత్‌ బిల్లు వస్తే..? అలాంటి అనుభవమే జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి శ్రీరంగం వెంకటేశ్వర్లుకు కలిగింది. తన ఫ్లాట్‌కు రూ.3,21,05,218 విద్యుత్‌ బిల్లు రావడంతో లబోదిబోమంటూ విద్యుత్‌ అధికారులను సంప్రదించగా సరిచేసి కొత్త బిల్లు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంకటేశ్వర్లు ఫ్లాట్‌కు గత ఏడాది నవంబర్‌లో రూ.175 బిల్లు వచ్చింది.

ఏడాదికి పైగా ఆ ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో విద్యుత్‌ వినియోగం కూడా లేదు. వచ్చే బిల్లును నెలనెలా చెల్లిస్తున్నా.. ఈ నెల రూ.3,21,05,218 బిల్లు వచ్చింది. దీనిపై ఈఆర్వో విభాగం ఏఈ రమేష్‌ను వివరణ కోరగా.. బిల్లుతీసే మెషీన్‌లో లోపం వల్ల అంత మొత్తం బిల్లు వచ్చిందని పేర్కొన్నారు. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం సాయంత్రం సరిచేసి రూ.175 బిల్లు ఇచ్చామని ఆయన వివరించారు.
(చదవండి: ‘ప్లేట్‌’ మార్చి.. అమ్మేసి... )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement