సాక్షి, ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు కార్పోరేట్ బిల్లులా ఉందని పిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ బిల్లుతో కార్పొరేట్ ఆదాని, అంబానీ వాళ్ళకి లాభం వచ్చేలా ఉంది తప్పా రైతులకు న్యాయం జరగదన్నారు. నూతన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట ఉరితాడుగా మారనున్నదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దమ్ము ఉంటే బిల్లుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తాడా అంటూ సవాల్ విసిరారు. ఈనెల 25న రాష్ర్ట వ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు నిరసనగా ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు. (రైతులకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ)
Comments
Please login to add a commentAdd a comment