సంగారెడ్డి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో వ్యాపారులకు అవకాశం కల్పించారని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. అదానీ, అంబానీ, అమెజాన్‌కు లాభం చేకూరే విధంగా మోదీ నిర్ణయం ఉందని ఆయన విమర్శించారు. వ్యవసాయ బిల్లులతో రైతులకు నష్టం కలుగుతుందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ర్టంలో కేసీఆర్ రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారని , మాయమాటలతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేయలేదని, పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రైతు ద్రోహి అని, పచ్చి అబద్ధాలతో కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను అమలు చేయబోమని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment