మధ్యప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ నిరోధక బిల్లు.. 10 ఏళ్ల జైలు శిక్ష.. ఆస్తుల జప్తు | Madhya Pradesh Home Minister Says Govt Will Enact Laws Against Organized Crime | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ నిరోధక బిల్లు.. 10 ఏళ్ల జైలు శిక్ష.. ఆస్తుల జప్తు

Published Sat, Aug 7 2021 4:13 PM | Last Updated on Sat, Aug 7 2021 4:23 PM

Madhya Pradesh Home Minister Says Govt Will Enact Laws Against Organized Crime - Sakshi

భోపాల్: మంద బలం, అధికార బలం కోసం కొందరు తహతహలాడుతుంటారు. ఓ పది మంది రౌడీలను వెంటేసుకుని ఓ గ్యాంగ్‌కు లీడర్‌ అయిపోతారు. డబ్బుల కోసం జనాలను పీడిస్తూ.. వివిధ నేరాలకు పాల్పడుతూ.. అడ్డు అదుపు లేకుండా ప్రర్తిస్తారు. అయితే ఇకపై గ్యాంగ్‌స్టర్‌గా మారాలంటే వారి వెన్నుల్లో వణుకు పుట్టించే ఓ చట్టాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీసురానుంది.

మధ్యప్రదేశ్‌లో వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా "మధ్యప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ నిరోధక బిల్లు" ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా  తెలిపారు.   ఈ చట్టం ప్రకారం.. గ్యాంగ్‌స్టర్‌లకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు ఆస్తులను అటాచ్‌ చేయడం జరుగుతుందని అన్నారు.  లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, పేకాట డెన్‌లు నిర్వహిస్తున్న వారిని కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement