సాక్షి, హైదరాబాద్ : గత ప్రభుత్వాల అసంబద్ధ వ్యవసాయ విధానాల వల్లే రైతులకు ఈ కష్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం సంవత్సరం వస్తే రైతులకు మాత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ 26న వచ్చిందని తెలిపారు. వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్..కళ్లుండి చూడలేని కబోది అని, పిట్ట కథలు చెప్పి పబ్బం గడపడమే కేసీఆర్ కు తెలుసునని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 6850 కోట్ల రూపాయిలతో వ్యవసాయ ఉత్పత్తుల కల్పనకు కేంద్రం ఖర్చు చేయబోతుందని చెప్పిన బండి సంజయ్.. బూత్ స్థాయి నుంచి ప్రజలకు అర్థమయ్యేలా ఈ బిల్లు ప్రయోజనాల గురించి తెలియజేస్తామని వెల్లడించారు. తమ ఉనికి చాటుకోవడానికే కాంగ్రెస్ రైతుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని కానీ రైతుల మద్దతు మాత్రం ఆ పార్టీకి లేదని పేర్కొన్నారు. (అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: డీకే అరుణ )
Comments
Please login to add a commentAdd a comment