ఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో చేరాలనుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న 21 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లుకు పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీని వల్ల త్రివిధ దళాల్లో సాంకేతిక ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల పొందే అవకాశాలు అధికంగా ఉంటాయని శుక్రవారం సీనియర్ మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు.
అదే విధంగా నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మంది ఉద్యోగులను కొనసాగించాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కేవలం 25 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ మాత్రమే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము సూచించనట్లుగా 50 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించటం వల్ల కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో మ్యాన్ పవర్ కొరత తగ్గించవచ్చని మరో సైనిక అధికారి అభిప్రాయపడ్డారు. శక్తిమంతమైన సైన్యం కోసం ఈ మార్పులు అవసరమని అన్నారు.
రెండేళ్ల వయోపరిమితి పెంచటం మూలంగా త్రివిధ దళాల్లో గ్రాడ్యుయేషన్ పర్తైన అభ్యర్థులు అధిక సంఖ్యలో నియమించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే అగ్నిపథ్ పథకం కింద త్రివిధ దళాల్లో నియామకానికి పదిహేడున్నరేళ్ల నుంచి 21 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఇక నాలుగేళ్ల సర్వీస్ పూర్తి అయిన తర్వాత కేవలం 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్ సర్వీసు కింద మరో 15 ఏళ్లకు పొడిగించనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment