74 ఏళ్ల 'ఏజ్లెస్‌ బ్యూటీ'..చూస్తే టీనేజ్‌ అమ్మాయిలా..! | 74 Year Old Vera Wangs Age Defying Image | Sakshi
Sakshi News home page

వయసు 74 ఏళ్లు, చూస్తే..పదహారణాల పడుచు పిల్లలా ఏముందంటే..!

Published Wed, May 29 2024 6:10 PM | Last Updated on Wed, May 29 2024 7:14 PM

74 Year Old Vera Wangs Age Defying Image

ఎవ్వరైనా కనీసం 50 దాటితేనే ఏజ్‌డ్‌గా కనిపించేస్తారు. ఎంతలా మేకప్‌తో కవర్‌ చేద్దామన్నా..ముడతలు పడ్డ చర్మాన్ని దాచడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా మెడ, చేతులు, ముసలివాళ్లైనట్లు క్లియర్‌గా కనిపించేస్తుంది. అలాంటిది ఈ బామ్మ ఏజ్‌లో ఉన్న ఈ మహిళను చూస్తే వామ్మో అంటారు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. ఆ రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే విందామా..!

అమెరికన్ ​ ఫ్యాషన్‌ డిజైనర్‌ వెరా వాండ్‌ వయసు 74 ఏళ్లు. కానీ ఆమె అందానికే అందానివే.. అన్నంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమెను చూడగానే ఎవ్వరూ కూడా ఆమెకు అంత ఏజ్‌ ఉంటుందని అస్సలు అనుకోరు. అంతేగాదు తాను ఎప్పుడూ మెరిసిన జుట్తుతో అస్సలు కనిపించనని చాలా ధీమాగా చెప్పేస్తోంది. అయితే ఒకనొక మీడియా ఇంటర్యూలో మాత్రం తన తలకు రంగు వేస్తానని ఒప్పుకుంది. అయినప్పటికీ స్కిన్‌ అంత టైట్‌గా యువకుల మాదిరిగా ఉండటం మాత్రం ఆశ్చర్యమే. 

 

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ పేరుగాంచిన వాంగ్‌ని తన బ్యూటీ రహస్యం ఏంటని పలు మీడియాలు ప్రశ్నించగా..‌"తాను 19 ఏళ్ల నుంచి ఫ్యాషన్‌ ప్రపంచంలో ఉన్నాను. తానెప్పుడూ యవ్వనం గురించి ఆలోచించలేదని చెబుతోంది. ఎందుకంటే..ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలతో రోజూ పని చేస్తుంటాను కాబట్టి నాకు ఆ ఆలోచనే రాదంటోంది. వాళ్లను చూస్తు ఉత్సాహాంగా పనిచేయడం వల్ల తాను ఇలా యంగ్‌గా కనిపిస్తున్నాని అంటోంది." వాంగ్‌. నిజంగా గ్రేట్‌ కదా ఆమె. ఈ ఏజ్‌లో కూడా టీనేజ్‌ అమ్మాయి లుక్‌ మెయింటైన్‌ చేస్తోందంటే మాములు విషయం కాదు కదా..! 

(చదవండి: అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్‌ బ్యాగ్‌ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement