కార్డులను పంపిణీ చేస్తున్న లక్ష్మణ్
కవాడిగూడ: అసంఘటిత కార్మికులకు ఆర్యోగ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ–శ్రమ్ కార్డులను ప్రవేశపెట్టిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం భోలక్‌పూర్ డివిజన్ రంగానగర్‌లో డివిజన్ ఓబీసీ మోర్చా కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ–శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం, విద్య కల్పించేందుకు అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఆయూష్‌మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం అని, దీనితో రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.పేదలకు ఆరోగ్య బీమా పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మండిపడ్డారు.
కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పూసరాజు, ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనియర్ ఉమేష్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రవి, బిజ్జి కనకేష్ కుమార్, నిత్యానంద్, మహేష్ సుందరి నర్సింహా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment