
హోలీ సంబరాల్లో మాట్లాడుతున్న బండి సంజయ్
కరీంనగర్ టౌన్: తెలంగాణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడ్వడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వట్లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్‌లో ప్రారం భోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. శుక్రవారం కరీంనగర్‌లో కార్యకర్తలు, నాయకులతో హోలీ సంబరాల్లో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి సీఆర్‌ఐఎఫ్ కింద రూ.205 కోట్లు, అలాగే ప్రధానమంత్రి సడక్ యోజన, ఈజీఎస్ కింద వేలాది కోట్లు, ఎల్కతుర్తి–సిద్దిపేట రోడ్డు నిర్మాణానికి నిధులు తీసుకొచ్చాం. అయినా తానేం చేయలేదని టీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు’అని విమర్శించారు. ‘ఏది పడితే అది మాట్లాడితే జనం వాత పెడతారు’అని హెచ్చరించారు.
నీటి వాటాలో అన్యాయం
వేములవాడ రాజన్న ఆలయానికి ‘ప్రసాద్’స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర సర్కారు ఇప్పటికీ కనీస ప్రతిపాదనలు పంపలేదని సంజయ్ విమర్శించారు. డీపీఆర్ పంపకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎట్లా ఇస్తా రని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఓటింగ్‌లో పాల్గొనని కేసీఆర్.. సీఎం అయ్యాక నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం చేశారని, ప్రాజెక్టుల పేరుతో దోచుకుం టున్నారని విమర్శించారు.
గంగులపై పోటీ చేయాలని తూట్‌పాలిష్‌గాళ్లు చెబి తే పట్టించుకునేదెవరన్నారు. టీఆర్‌ఎస్ లెక్క బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదని.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎంఐఎం కోసం మైనారిటీ సం తుష్ట విధానాలను అవలంబించే టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment