అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట.. కేంద్రం కీలక ప్రకటన | Ayodhya Ram Mandir Inauguration Ceremony: Half Day Holiday For Central Government Employees - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట.. కేంద్రం కీలక ప్రకటన

Published Thu, Jan 18 2024 3:39 PM | Last Updated on Thu, Jan 18 2024 7:33 PM

For Ram Temple Ceremony Half Day For Central Government Employees - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న హాఫ్‌ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్‌ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. 

అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి.  శ్రీరామ్‌లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్‌పేజీ ప్రారంభించిన ఐఎండీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement