Half day leave
-
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్‌లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్‌పేజీ ప్రారంభించిన ఐఎండీ -
ఈ నెల 12న ముస్లిం ఉద్యోగులకు సగం రోజు సెలవు
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 వ తేదీన ఇస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వీలుగా ముస్లిం ఉద్యోగులకు సంగం దినం (హాఫ్ డే) సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 న ఉదయం పూట విధులకు హాజరై, సాయంత్రం వివిధ ప్రాంతాల్లో జరిగే ఇఫ్తార్ విందుకు హాజరు కావాలని ముస్లిం ఉద్యోగులను ముఖ్యమంత్రి కోరారు. జూలై 12 ఆదివారం అయినప్పటికీ కొన్ని శాఖల్లో, వీక్లీ ఆఫ్ విధానం పాటించే సంస్థల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.