న్యూఢిల్లీ: కేంద్రంలో పలు విభాగాల్లో 9.79 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వం బుధవారం తెలిపింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘‘2021 మార్చి 1 నాటికి అన్ని శాఖలు, విభాగాలు, సంస్థల్లో 9.79 లక్షలకుపైగా ఖాళీలున్నాయి.
రైల్వేశాఖలోనే 2.93 లక్షలున్నాయి. రక్షణ శాఖలో 2.64 లక్షలు, హోం శాఖలో 1.43 లక్షలు, రెవెన్యూలో 80,243, ఆడిట్–అకౌంట్ విభాగంలో 25,934, అణు ఇంధన శాఖలో 9,460 ఖాళీలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ఆదేశించాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment