సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా సాహస పర్యాటకాని(అడ్వెంచర్ టూరిజం)కి విస్తృత అవకాశాలు ఉన్నా యని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి అనేక ప్రదేశాలున్నాయని తెలిపారు. ఆయా అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి వినూత్న విధానాలతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు. రెండో పర్యాటక రంగ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో ‘సాహస పర్యాటకం’పై ఏర్పాటు చేసిన సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడ్వెంచర్ టూరిజానికి హిమాలయాలను మించిన ఉత్తమమైన ప్రదేశం మరొకటి ఉండదని, అందుకే ఈ సామర్థ్యాన్ని సద్వినియోగ పరుచుకునే దిశగా కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్, మౌంటనీరింగ్ వంటి వాటికి డిమాండ్ పెరిగిందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.
పులుల సంరక్షణలో తెలంగాణ విఫలం
పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో గొప్పలు మినహా క్షేత్రస్థాయిలో నిధులు అందడం లేదని, పులుల సంరక్షణకు రూ.2.2 కోట్లు కూడా కేటాయించక పోవడమే అందుకు నిదర్శనమన్నారు. దేశంలో పులుల సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి శనివారంతో యాభై ఏళ్లు పూర్తి కాగా ప్రపంచ అడవి పులుల సంఖ్యలో భారత్‌లోనే 70 శాతానికి పైగా పులులున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, ఏటూరు నాగారం, కిన్నెరసాని, పాఖల్, పోచారం, మంజీర, ప్రాణహిత వంటి వన్యప్రాణుల అభయారణ్యాలకు కేంద్రం రూ.30 కోట్లు ఇచి్చందని తెలిపారు. అనంతరం...కిషన్‌రెడ్డి అడ్వెంచర్ టూరిజంకు ఉన్న అవకాశాలపై వివిధ దేశాల ప్రతినిధులు ప్యానల్ చర్చలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment