
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ గురువారం వీటిని ప్రకటించింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ గురువారం వీటిని ప్రకటించింది. ఈ పురస్కారం దక్కిన వారిలో 15 మంది సీబీఐకి చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, కేరళ, రాజస్థాన్ నుంచి 9 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్ (10), తమిళనాడు (8), బిహార్ (7), తెలంగాణ (5), గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులుండటం విశేషం.