జిల్లా కార్యాలయాలు ఏర్పాటు
-
సబ్‌కలెక్టర్ శశాంక
జగిత్యాల అర్బన్: జగిత్యాల జిల్లాకు సంబంధించిన కార్యాలయాల భవనాలను అన్నింటిని ఏర్పాటుచేసినట్లు సబ్‌కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం సాయంత్రం విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం పంచాయతీరాజ్‌శాఖ భవనాన్ని కలెక్టరేట్ కోసం కేటాయించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ గెస్ట్‌హౌస్‌ను జేసీకి కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్ గెస్ట్ హౌస్ మాత్రం ప్రస్తుతం సబ్‌కలెక్టర్‌కార్యాలయంలోఉన్న హౌస్‌ను, పోలీస్ డీపీవో భవనం ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లా ట్రెజరీ ల్యాండ్‌సర్వే కార్యాలయాలను ప్రస్తుతం ఉన్న ఐఅండ్‌క్యాడ్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మిగతా కార్యాలయాలన్నీ ఎస్సారెస్పీ క్వాటర్లలో కొనసాగుతున్న కార్యాలయాల్లోనే చేస్తున్నట్లు తెలిపారు. ఇతర శాఖలన్నింటిని అందులోనే ఏర్పాటు చేసి దసరా నుంచి జిల్లాపాలనకొనసాగుతుందని తెలిపారు. మెట్‌పల్లిలో డివిజన్ కేంద్రం ఏర్పాటవుతుందని, ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ కార్యాలయన్నే ఆర్డీవో కార్యాలయంగా ప్రతిపాదించామని వివరించారు.జగిత్యాల రూరల్, బుగ్గారం, బీర్‌పూర్ మండలాలను కేటాయించాలని ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. కార్యాలయాలను మరమ్మతు పనుల కోసం పీఆరీ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. వీరు మంగళవారం నుంచి పనులుసైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు.