
గిరిజన పాఠశాల భవనం పరిశీలన
మహబూబాబాద్ : జిల్లా ఏర్పాటు నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయాల నిమిత్తం జిల్లా కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు పట్టణ శివారులోని ఇందిరానగర్ కాలనీలోని ప్రభుత్వ బాలుర గిరిజన ఉన్నత పాఠశాల భవనాన్ని వ్యవసాయ శాఖ జేడీ ఉషా, హార్టికల్చర్ డీడీ పుట్ట సునిత పరిశీలించారు. భవనంలోని గదులను తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్‌ఐ జర్పుల సుధాకర్‌నాయక్ వారికి చూపించారు. ఈ భవనంలో 12 గదులు ఉండగా పైఅంతస్తులోని నాలుగు గదులను వ్యవసాయ శాఖకు కేటాయించామని, అందులో హార్టికల్చర్, సెరీకల్చర్, ఇతర అధికారుల కార్యాలయాలు ఏర్పా టు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ భవనంలోని కింది నాలుగు గదుల్లో డీటీఓ కార్యాలయానికి కేటాయించనున్నట్లు చెప్పారు. ఏఓ కె.రామారావు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.