
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సరికొత్తగా వర్క్‌ప్లేస్ చాట్ యాప్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త చాట్ యాప్‌ను ఆఫీసులో వివిధ డిపార్ట్‌మెంట్ల మధ్య వ్యక్తులను కనెక్ట్ చేయడం కోసం లాంచ్ చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీఎస్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ వర్క్‌ప్లేస్‌కు ఈ యాప్ లింక్ అయి ఉంటుంది. ఉద్యోగుల మధ్య మెసేజింగ్‌కు ఇది ఉపయోగపడుతోంది. గ్రూప్ ప్రాజెక్టుల విషయంలో ఉద్యోగులు ఈ యాప్‌లో చర్చించుకోవడం వంటివి చేసుకోవచ్చు.
పలు ముఖ్యమైన అంశాలపై కూడా లైవ్ వీడియో సెషన్స్ ద్వారా ఉద్యోగులు చర్చించుకోవచ్చు. వర్క్‌ప్లేస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగులు ఎక్కువగా మొబైల్ డివైజ్‌లు కంటే తమ డెస్క్‌టాప్‌లనే వాడుతుంటారు. ఎక్కువ సమయం డెస్క్‌టాప్‌లపైనే కేటాయిస్తున్నారు. అందుకోసం డెస్క్‌టాప్ యాప్‌ను కూడా ఫేస్‌బుక్ తీసుకొచ్చింది. వర్క్‌ప్లేస్ చాట్ ద్వారా సహ ఉద్యోగులతో లేదా గ్రూప్‌తో వీడియో చాట్, స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్స్, @మెంక్షన్స్, జీఐఎఫ్స్ వంటి ఫీచర్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment